యర్రగొండపాలెం: దోర్నాల మండల కేంద్రంలో ఆటో ఆకస్మాత్తుగా టిప్పర్ కు అడ్డంగా వచ్చింది డ్రైవర్ సమయస్ఫూర్తితో తప్పిన పెను ప్రమాదం
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కేంద్రంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆటో ఆకస్మాత్తుగా టిప్పర్ కు అడ్డుగా రావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. కాగా టిప్పర్ డ్రైవర్ సమయస్ఫూర్తితో వెంటనే బ్రేకులు వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. స్థానికులు టిప్పర్ డ్రైవర్ అప్రమత్తతను అభినందిస్తూ వాహనదారులు వేగ నియంత్రణ పాటించాలని సూచించారు.