ఉరవకొండ: ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద 86 మంది లబ్ధిదారులకు రూ.36.16 లక్షల విలువచేసే చెక్కుల పంపిణీ చేసిన మంత్రి పయ్యావుల కేశవ్
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెద్దకౌకుంట్ల గ్రామంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన 86 మంది లబ్ధిదారులకు రూ. 36.16 లక్షల విలువచేసే చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రిమాట్లాడుతూ, ఆపదలో ఉన్న పేద ప్రజలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని తెలిపారు. వైద్య చికిత్సలు, అత్యవసర అవసరాల సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైన వారికి సీఎం ఆర్ ఎఫ్ అండగా నిలిచిందన్నారు.