కనిగిరి: దాడిలో గాయపడ్డ వారిని కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో పరామర్శించిన కనిగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి నారాయణ యాదవ్
పెదచెర్లోపల్లి మండలంలోని అడవిలో పల్లి గ్రామంలో భూ వివాదాల కారణంగా ఇరు వర్గాల మధ్య దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పలువురికి గాయాలు కాగా వారిని కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న వారిని కనిగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ శనివారం పరామర్శించారు. దాడికి గల కారణాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ప్రజాస్వామ్యంలో దాడులు మంచి పద్ధతి కాదని, దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని నారాయణ యాదవ్ డిమాండ్ చేశారు.