రాప్తాడు: ప్రసన్నాయిపల్లి గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పరిసరాలను శుభ్రం చేసిన డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసులు
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ప్రసన్నాయిపల్లి పంచాయతీలో బుధవారం 11 నుంచి మూడున్నర గంటల వరకు నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసులు పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రసన్నాయిపల్లి పంచాయతీలో నిర్వహించి ప్రధాన రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెత్తను తొలగించి పరిసరాలన్నీ శుభ్రం చేయడం జరిగిందని అదేవిధంగా మొక్కలు కూడా నాటడం జరిగిందని రాప్తాడు డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసులు పేర్కొన్నారు.