ఉరవకొండ: వజ్రకరూరు మండల తహసిల్దార్ గా జయశ్రీ ఇటీవల బాధ్యతలు చేపట్టడంతో మాల మహానాడు ఆధ్వర్యంలో గౌరవ సన్మానం
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండల తహసిల్దార్ గా జయశ్రీ ఇటీవల బాధ్యతలు చేపట్టడంతో మాల మహానాడు ఆధ్వర్యంలో గురువారం గౌరవ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు మొలక బాల రామాంజనేయులు ఆధ్వర్యంలో తహసీల్దార్ ను దుశ్యాలువాలు పూల మాలలతో సన్మానించారు. ఉత్తమ సేవలే లక్ష్యంగా పేదల అభ్యుదయానికి కృషి చేస్తూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా విధులు చేపట్టాలని ఈ సందర్భంగా మాల మహానాడు నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శర్మాస్ వలీ, చార్లెస్, వసంత, సుంకన్న, గోవిందు తదితరులు పాల్గొన్నారు.