ఉరవకొండ: కౌకుంట్లలో మంత్రి పయ్యావుల కేశవ్ పిజిఆర్ఎస్ స్వీకరణ, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన మంత్రి
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామంలోని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యుల క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ రకాల సమస్యలపై మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ అర్జీలను స్వీకరించి సమస్యలను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటున్నామన్నారు.