కనిగిరి: దేశ అభివృద్ధికి విద్య, వైద్య రంగాలు కీలకం: కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి
కనిగిరి: దేశ అభివృద్ధికి ఆరోగ్యం, విద్య రంగాలు కీలకమని కనిగిరి ఎమ్మెల్యే మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పేర్కొన్నారు. సోమవారం న్యూఢిల్లీలో NFPRC ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ 2047 నిర్మాణం కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యం, విద్యా సంస్కరణల పై నిర్వహించిన సదస్సులో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువతకు నాణ్య మైన విద్య, ప్రజలకు అందుబాటు ఆరోగ్య సేవలు అందించడం అత్యంత అవసరమని అన్నారు