ఉరవకొండ: బూదిగుమ్మ రామసాగరం వద్ద పెన్నా నది పై నూతన బ్రిడ్జి నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ అంబికాలు
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజవర్గంలోని బెలుగుప్ప మండల పరిదిలో ఉన్న బూదిగుమ్మ రామసాగరం వద్ద పెన్నా నది పై నూతన బ్రిడ్జి నిర్మాణానికి ఆదివారం రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక,వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ,అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబిక లక్ష్మీనారాయణలు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. నూతన బ్రిడ్జి నిర్మాణానికి రూ. 91 కోట్ల నిధులతో పనులు చేపట్టడం జరిగిందని మంత్రి మరియు ఎంపీలు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మాట ఇచ్చి నిలుపుకుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. బ్రిడ్జి పనులు పూర్తి అయితే అన్ని వర్గాల అభ్యున్నతికి దోహదపడుతుందన్నారు.