సంతనూతలపాడు: చీమకుర్తి మండలం గోనుగుంట లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం, భారీగా తరలివచ్చిన భక్తులు
చీమకుర్తి పట్టణంలోని గోనుగుంట గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. గోనుగుంట గ్రామం నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు స్వామివారి కల్యాణ మహోత్సవానికి తరలివచ్చి కళ్యాణాన్ని కనులారా వీక్షించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ నిర్వాహకులు, మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.