సంతనూతలపాడు: మద్దిపాడు మండలం కొత్తపల్లి వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొన్న లారీ, డ్రైవర్ కు గాయాలు, ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలింపు
మద్దిపాడు మండలం కొత్తపల్లి వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు నుండి ఒంగోలుకు వెళ్తున్న లారీ డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కు గాయాలయ్యాయి. స్థానికులు గాయాలైన లారీ డ్రైవర్ ను 108 అంబులెన్స్ లో ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలించారు.