కనిగిరి: వైసీపీ క్యాడర్ ఫోటో ఐడి వెరిఫికేషన్ ప్రక్రియను జూలై 7 లోపు పూర్తి చేయాలి: కనిగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి నారాయణ
కనిగిరి నియోజకవర్గం లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీలలో నియామకం పూర్తయిన వారు జూలై 7వ తేదీ లోపు తమ ఫోటో ఐడి వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కనిగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ కోరారు. గురువారం కనిగిరిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... జూలై 7 తర్వాత వైసీపీ క్యాడర్ అప్లికేషన్ అందుబాటులో ఉంటుందన్నారు. ఇంకా కనిగిరి నియోజకవర్గంలో ఫోటో ఐడి వెరిఫికేషన్ పూర్తి చేసుకోలేకపోయినా క్యాడర్ తప్పనిసరిగా ఆ ప్రక్రియను పూర్తి చేయాలని నారాయణ యాదవ్ సూచించారు