సంతనూతలపాడు: చీమకుర్తి పట్టణంలో పెట్రోల్ బంకుల వద్ద తగ్గిన రద్దీ, అధికారుల చర్యలతో సాధారణ స్థితి
చీమకుర్తి పట్టణంలో పెట్రోల్ బంకుల వద్ద బుధవారం సాధారణ స్థితి నెలకొంది. గత నాలుగు రోజులుగా ఇందన కొరత భయంతో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. దీనికి తోడు కొన్నిచోట్ల నో స్టాక్ బోర్డులు కనిపించడంతో, ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన జిల్లా కలెక్టర్ కల్పనకుమారి, జాయింట్ కలెక్టర్ హర్షవర్ధన్ రాజు పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితిని సమీక్షించారు. వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేయడం మరియు బుధవారం తగినంత స్టాకు కూడా అందుబాటులో ఉండడంతో పెట్రోల్ బంకుల వద్ద సాధారణ స్థితి నెలకొంది. వాహనాల రద్దీ ఎక్కడా కనిపించలేదు.