కనిగిరి: పామూరు మండలం వీరభద్రపురంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడులు, పేకాట ఆడుతున్న 8 మంది అరెస్ట్
పామూరు: పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించి ఎనిమిది మందిని అరెస్టు చేసిన సంఘటన పామూరు మండలం వీరభద్రపురంలో ఆదివారం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వీరభద్రపురంలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పామూరు ఎస్సై అనూక్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 8 మందిని అరెస్టు చేయడంతో పాటు వారి వద్ద నుండి రూ.5,350 నగదును స్వాధీనం చేసుకున్నారు. పామూరు మండలంలో ఎక్కడైనా పేకాట శిబిరాలు, కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.