కనిగిరి: పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ సిబ్బందికి యోగాలో శిక్షణ కార్యక్రమం
కనిగిరి పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో శనివారం యోగాలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా శిక్షకులు పోలీస్ సిబ్బందికి యోగ ఎలా చేయాలో నేర్పించారు. అనంతరం సీఐ శ్రీనివాసులు మాట్లాడుతూ... పోలీసుల వృత్తి ఒత్తిడితో కూడుకున్నదన్నారు. పోలీసులు ఒత్తిడిని అధిగమించేందుకు క్రమం తప్పకుండా ప్రతిరోజు యోగా చేయడానికి అలవాటు చేసుకోవాలన్నారు. యోగా ద్వారా దీర్ఘకాలిక రుగ్మతలను సైతం నయం చేసుకోవచ్చని సూచించారు. ఏకాగ్రత, జ్ఞాపక శక్తిని పెంపొందించుకునేందుకు యోగ ఒక సాధనం గా ఉపయోగపడుతుందన్నారు.