కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే సురేంద్రబాబును ఘనంగా సన్మానించిన దివ్యాంగులు
కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే సురేంద్రబాబును మంగళవారం దివ్యాంగులు ఘనంగా సన్మానించారు. దివ్యాంగుల సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు ఉద్దీప్ సింహ ఆధ్వర్యంలో పలువురు దివ్యాంగులు ఎమ్మెల్యేను శాలువా, పూలమాలలతో సత్కరించారు.ఆర్డీటీ కి ఎఫ్ సీ ఆర్ ఏ రెన్యువల్ చేయించడంలో ఎమ్మెల్యే ఎంతగానో కృషి చేశారని దివ్యాంగులు ప్రశంసించారు. ఎమ్మెల్యేగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.