కనిగిరి: నందన మారెళ్ళ లో రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టిన ఆటో, మహిళలకు తీవ్ర గాయాలు
కనిగిరి: రోడ్డు దాటుతున్న మహిళను ఆటో ఢీకొట్టడంతో మహిళకు తీవ్ర గాయాలైన సంఘటన కనిగిరి మండలం నందన మారెళ్ళ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నందన మారెళ్ళ లో గండపనేని శివకుమారి అనే మహిళ రోడ్డు దాటుతున్న క్రమంలో వేగంగా వచ్చిన ఆటో ఆమెను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శివకుమార్ కి తీవ్ర గాయాలు కాగా, స్థానికులు 108 వాహనంలో కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించగా అక్కడ వైద్యులు ఆమెకు చికిత్స చేసి, మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.