రాప్తాడు: రాప్తాడు పోలీస్ స్టేషన్ లో ఏబీఎన్ రాధాకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేసిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో గురువారం 11:30 గంటల సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏబీఎన్ రాధాకృష్ణ పై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఏబీఎన్ రాధాకృష్ణ పత్రిక టీవీ ఛానల్ ద్వారా నిత్యం జగన్మోహన్ రెడ్డి పైన తప్పుడు కథనాలు ప్రసారం చేస్తూ కార్యకర్తల పైన కూడా కించపరిచే విధంగా వ్యాకరించడం జరిగిందని ఇలాంటి వారిపై కేసు నమోదు చేసి విచారణ చేసి కఠినంగా శిక్షించాలని లేకుంటే రానున్న రోజుల్లో ఆందోళన కొనసాగిస్తామని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు.