కనిగిరి: పట్టణంలో మధ్య శ్రద్ధలతో బక్రీద్ పర్వదిన వేడుకలు, ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లింలు
కనిగిరి పట్టణంలో బక్రీద్ పర్వదిన వేడుకలు గురువారం ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా కనిగిరి పట్టణంలోని ఈద్గా వద్ద పెద్ద సంఖ్యలో చేరుకున్న ముస్లింలు అక్కడ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ... త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అన్నారు. ప్రతి ఒక్కరు దయాగుణం, దాన గుణం కలిగి ఉండాలని, సాటి మనిషి పట్ల ప్రేమపూర్వకంగా మెలుగుతూ పరస్పర సహకారంతో జీవించాలని సూచించారు.