గిద్దలూరు: గిద్దలూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహణ
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా దర్బారు కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. కొన్ని అర్జీలను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తక్షణమే పరిష్కరించగా మరికొన్ని సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బాలు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.