గిద్దలూరు: గిద్దలూరులో మద్యం తాగి వాహనం నడిపి వ్యక్తి చావుకి కారణమైన నిందితుడికి 3 సంవత్సరాలు జైలు శిక్ష విధించిన గిద్దలూరు కోర్టు
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలంలో మద్యం తాగి ద్విచక్ర వాహనం నడిపి ఓ మనిషి చావుకి కారణమైన మేడం శ్రీనివాసులు అనే వ్యక్తికి సోమవారం గిద్దలూరు కోర్టు 3 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. 2015 వ సంవత్సరంలో మద్యం తాగి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని వాహనంతో ఢీకొట్టాడు. ప్రమాదంలో ఆ వ్యక్తి మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సాక్షాదారాలను కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ జరిపిన కోర్టు నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి భరత్ చంద్ర ముద్దాయికి జైలు శిక్ష బాధిత కుటుంబానికి లక్ష నగదు పరిహారంగా అందించాలని ఆదేశించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గిద