రాయదుర్గం: బిఎల్ఓ ల ఇంటింటి సందర్శన సమయంలో బిఎఏల సహకారం తప్పనిసరి : తహసీల్దార్ హరికుమార్
బిఎల్ఓ లు ఇంటింటి సందర్శన సమయంలో రాజకీయ పార్టీల బిఎల్ఏల ల సహకారం తప్పనిసరి అని అందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని రాయదుర్గం నియోజకవర్గం అసిస్టెంట్ ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, తహసీల్దార్ ఎ. హరికుమార్ తెలియజేశారు. శనివారం రాయదుర్గం తహసీల్దార్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి, గుమ్మగట్ట తహసీల్దార్ రజాక్ వలి, డి.హిరేహాల్ తహసీల్దార్ శ్రీనివాసులు, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ సుజాత, ఇతర అధికారులతో కలిసి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల పేరు మార్పులు, 1200 మంది ఓటర్లకు మించి ఉన్న పోలింగ్ కేంద్రాల విభజన,