విశాఖపట్నం: ఏపీలో డిక్సన్ టెక్నాలజీస్ రూ.700 కోట్ల పెట్టుబడి: 2,300 కొత్త ఉద్యోగాలు!
ఏపీలో డిక్సన్ టెక్నాలజీస్ రూ.700 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్‌తో కంపెనీ ప్రెసిడెంట్ పంకజ్ శర్మ సమావేశమయ్యారు. దీనివల్ల 2,300 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే కొప్పర్తిలో జరుగుతున్న రూ.450 కోట్ల విస్తరణ ద్వారా 7వేల ఉద్యోగాలు లభించనున్నాయి.