రాజమండ్రి రూరల్: టీడీపీకి షాక్ ఇచ్చిన మాజీ కార్పొరేటర్ కుటుంబం
రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ. మాజీ కార్పొరేటర్ సింహ నాగమణి, ఆమె కుమారుడు సింహ శివ రామకృష్ణ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. కార్యకర్తలకు విలువ ఇవ్వడం లేదని టీడీపీపై వారు అసహనం వ్యక్తం చేశారు.