యర్రగొండపాలెం: దుకాణంలోకి దూసుకెళ్లిన లారీ, పూర్తిగా ధ్వంసం అయిపోయిన దుకాణం
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో ఆదివారం ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. ఎర్రగొండపాలెం నుండి మాచర్ల రోడ్డులో వీరబ్రహ్మం అనే వ్యక్తి టీ స్నాక్ దుకాణం నిర్వహిస్తున్నాడు. పోరుమామిళ్ల వైపు నుంచి వేగంగా వచ్చిన ఓ లారీ అదుపుతప్పి షాపులోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. దుకాణం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. లారీని పట్టుకొని విచారణ చేపట్టారు.