రాయదుర్గం: ఇస్మాయిల్ మృతి అంత్యంత బాధాకరం : ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన టిడిపి నాయకుడు లడ్డు ఇస్మాయిల్ మృతి చెందడం అత్యంత భాగాకారమని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం మద్యాహ్నం పట్టణంలో వారి నివాసంలో ఇస్మాయిల్ మృతదేహాన్ని సందర్శించి, పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఇస్మాయిల్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.