రాయదుర్గం: పట్టణంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను పట్టుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
రాయదుర్గం పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్ వద్ద విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను పట్టుకుని బసవరాజు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మారెమ్మ గుడి ఏరియాలో నివాసం ఉంటున్న ఇతను గతంలో హమాలి పని చేసేవాడు. కొద్ది రోజులు మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. ఆదివారం సాయంత్రం ట్రాన్స్ ఫార్మర్ ను పట్టుకున్నాడు. పక్కన ఉన్న డ్రైనేజీ కాలువలో పడిపోగా స్థానికులు ఆసుపత్రి కి తరలించారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు.