యర్రగొండపాలెం: త్రిపురాంతకం మండలంలో వర్చువల్ మహానాడు కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించిన టిడిపి ఇన్చార్జి ఎరీక్షన్ బాబు
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండల కేంద్రంలో మే 27 28వ తేదీలలో జరుగుతున్న వర్చువల్ మహానాడు కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు పరిశీలించారు. ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. మొట్టమొదటిసారి వర్చువల్ విధానంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమాన్ని టిడిపి నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.