యర్రగొండపాలెం: దేవరాజు గట్టు గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు గుమ్మ గంగరాజు మృతి
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు గ్రామానికి చెందిన మండల మాజీ జెడ్పిటిసి భర్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కాటమరాజు ఆలయం చైర్మన్ గుమ్మా గంగరాజు మృతి చెందారు. గత మూడు రోజుల క్రితం అనారోగ్యంతో గుంటూరు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. హాస్పటల్లో చికిత్స పొందుతూ బుధవారం రోజు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో గంగరాజు మృతితో పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.