కొండపి: సింగరాయకొండలో కార్డెన్ సర్చ్ నిర్వహించిన పోలీసులు, సరైన ధ్రువపత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్ స్వాధీనం
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో డి.ఎస్.పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. స్థానిక సీఐ శ్రీహరి సిబ్బందితో కలిసి తెల్లవారుజాము నుంచి కాలనీలో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. కాలనీలోకి వచ్చిన పోలీసులను చూసి స్థానికుల ఆందోళన చెందారు. డి.ఎస్.పి వారికి కార్డెన్ సెర్పై వివరణ ఇవ్వడంతో పోలీసులకు సహకరించారు. అనంతరం సరైన ధ్రువీకరణ పత్రాలులేని 25 బైకులు, 2 ఆటోలు, ఒక ట్రాక్టరు సీజ్ చేశారు.