మార్కాపురం: జిల్లా కేంద్రంలోని ఓ వీధిలో రోడ్డుపై మురుగునీరుతో అవస్థలు పడుతున్న స్థానికులు
మార్కాపురం జిల్లా కేంద్రంలో పారిశుద్ధ్య పనులు చేపట్టాక డ్రైనేజీ తాలువల అద్వానంగా మారాయి. స్థానిక అమర జవాన్ల స్తూపం ఎదురువీధిలో మురుగునీరు రోడ్డుపైకి రావడంతో స్థానికులు తీవ్రవస్థలు పడుతున్నారు. ప్రధానంగా మురుగు కాలవల్లో చెత్తాచెదారం చేరి అందులో ఉన్న నీరు రోడ్డుపైకి వస్తుందని స్థానికులు తెలిపారు. గత కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి నెలకొన్నదని సంబంధిత అధికారులు పట్టించుకోవాలన్నారు.