మార్కాపురం: తర్లుపాడు మండలంలో సబ్సిడీలో కంది విత్తనాలకు ఆర్.బి.కె కేంద్రాలను సంప్రదించాలని రైతులకు తెలిపిన ఏవో జోష్నా దేవి
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలంలో కంది పంట సాగు చేసే రైతులకు ఎల్ఆర్జి 52 కంది విత్తనాలు 4కేజీలు 482రూ కాగా ప్రభుత్వం 120 రూపాయలు సబ్సిడీతో 362 రూ రైతులకు అందజేస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి జోష్నా దేవి తెలిపారు. కంది విత్తనాలు కావలసిన రైతులు సోమవారం నుండి రైతు సేవా కేంద్రంలో పేర్ల నమోదు చేసుకోవాలన్నారు. పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్, మొబైల్ తో సంబంధిత అధికారులను సంప్రదించి పేర్లను నమోదు చేసుకోవాలన్నారు