రాయదుర్గం: జీఓ నెంబర్ 396 రద్దు చేయాలని పట్టణంలోని డాక్యుమెంట్ రైటర్లు డిమాండ్
డాక్యుమెంట్ రైటర్ల జీవనోపాధికి విఘాతం కలిగించే ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీ.ఓ నెంబర్ 396 ను వెంటనే రద్దు చేయాలని రాయదుర్గం పట్టణంలోని డాక్యుమెంట్ రైటర్లు డిమాండ్ చేశారు. మంగళవారం రాయదుర్గం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి వినతిపత్రం అందజేశారు. డాక్యుమెంట్ రైటర్స్ వ్యవస్థను పరిరక్షించి, తమ వృత్తికి భద్రత కల్పించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈనెల 8, 9 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పెన్ డౌన్ నిరసన చేపడతామని వారు హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.