గిద్దలూరు: బేస్తవారిపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయాలలో విఆర్ నాయుడుని తొలగించాలని పూజలు నిర్వహించిన వైసిపి నేతలు
ప్రకాశం జిల్లా టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడుని వెంటనే తొలగించాలని గిద్దలూరు వైసిపి ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం బెస్తవారిపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బిఆర్ నాయుడు ప్రవర్తన మహిళల పట్ల అసభ్యకరంగా ఉందని అన్నారు. హిందువుల పవిత్రతను కాపాడేందుకు వెంటనే కూటమి ప్రభుత్వం టిటిడి చైర్మన్ ని తొలగించాలన్నారు.