గిద్దలూరు: కంభం మండలం నల్లకాలువ వద్ద అడవిపందిని ఢీకొని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందిన ద్విచక్ర వాహన దారుడు
మార్కాపురం జిల్లా కంభం మండలం నల్ల కాలువ గ్రామ సమీపంలో అడవి పంది ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. మృతుడు గిద్దలూరు మండలం క్రిష్టం శెట్టిపల్లి గ్రామానికి చెందిన తిరుపాలయ్యగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం సమయంలో తీవ్రంగా గాయపడ్డ తిరుపాలయ్యని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు ఎస్సై శివకృష్ణారెడ్డి తెలిపారు.