తాడిపత్రి: సరియైన రికార్డులు లేకపోతే వాహనాలను సీజ్ చేస్తాం: తాడిపత్రిలో రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి
సరైన రికార్డుల లేకపోతే వాహనాలను సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని తాడిపత్రి రూరల్ సీఐ శివ గంగాధర్ రెడ్డి హెచ్చరించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో బుధవారం ఆయన మాట్లాడారు. సరైన రికార్డులు, నంబర్ ప్లేట్లు లేకపోతే వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా అసాంఘిక కార్యకలాపాలపై కూడా ప్రత్యేక నిఘా వేశామన్నారు. ఇప్పటికే మట్కా, పేకాటపై స్థావరాలపై దాడులు చేసి పలువురిని అరెస్టు చేయడం జరిగిందన్నారు.