దర్శి: బొద్దుకూరపాడు జడ్పీహెచ్ఎస్ ఎంపీపీ ఎస్ పాఠశాలలో అడ్మిషన్ కోసం ఉపాధ్యాయులు ఇండ్లబాట
Darsi, Prakasam | Apr 22, 2026 ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు జడ్.పి.హెచ్.ఎస్ ఎంపీపీ ఎస్ పాఠశాలలో విద్యార్థులను అడ్మిట్ చేర్చుకునేందుకు ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగారు. ఐదు సంవత్సరాల నిండిన బాల బాలికలకు ఉచిత విద్యా పథకాల అందిస్తూ మెరుగైన సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందని తల్లిదండ్రులకు వివరించారు. అనుభవమున్న ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎం ఉపాధ్యాయులు పాల్గొన్నారు.