దర్శి: కురిచేడు మండలంలో భారీ వర్షంతో ఊపిరి పీల్చుకున్న ప్రజలు
Darsi, Prakasam | May 24, 2026 ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలో భారీ వర్షం పడడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. గత మూడు రోజులుగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతతో వృద్ధులు పిల్లలు అల్లాడిపోయారు. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి భారీ వర్షం కురవడంతో ఉపశమనం పొందారు. సోమారం నుండి రోహిణి కార్తి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎండలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎండ తీవ్రతకు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ హెచ్చరిస్తున్నారు.