గిద్దలూరు: గిద్దలూరు లోని ABM పాలెంలో భార్యను హత్య చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించే క్రమంలో ఉద్రిక్తత
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ABM పాలెంలో అనుమానంతో భార్య ప్రేమ కుమారిని భర్త గంగరాజు రోకల బండతో దాడి చేసి హతమార్చాడు. తర్వాత సంఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. నిందితుడి గుర్తించ క్రమంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నిందితుడిని అతని ఇంటిపైన నక్కి ఉన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసులు నిందితుడిని పోలీస్ స్టేషన్ తరలించే క్రమంలో ఆ ప్రాంతంలో ఉద్ధరిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. నిందితుడి పై బంధువులు కుటుంబ సభ్యులు దాడి చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.