మార్కాపురం: కేరళ లో యుడిఎఫ్ కూటమి ఘన విజయంతో జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పది సంవత్సరాల తర్వాత యుడిఎఫ్ కూటమి ఘన విజయం సాధించడం పట్ల మార్కాపురంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. టపాసులు కాల్చి స్వీట్లు పంచిపెట్టి హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ మహబూబ్ వలి మాట్లాడుతూ... దేశం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగ అవకాశాలు అభివృద్ధి జరుగుతుందన్నారు