తాడిపత్రి: ఇంటర్మీడియట్ లో స్టేట్ సెకండ్ ర్యాంకు సాధించిన తాడిపత్రి విద్యార్థిని సమీరా
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ పరీక్ష ఫలితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. తాడిపత్రి లో రోడ్డు పక్కన పూలు విక్రయించి జీవనం సాగించే స్మైల్ కుమార్తె సమీరా ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీలో 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి స్టేట్ సెకండ్ ర్యాంకు కైవసం చేసుకుంది. నియోజకవర్గం, జిల్లా స్థాయిల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. స్టేట్ సెకండ్ ర్యాంకు సాధించిన సమీరా ను గురువారం అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు. శుభాకాంక్షలు తెలియజేశారు.