రాయదుర్గం: కణేకల్లులో ఘనంగా మాజీ ఎమ్మెల్యే లక్కా చిన్నపరెడ్డి జయంతి
కణేకల్లు కు హెచ్ఎల్సీ కాలువ తీసుకురావడంలో రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే లక్కా చిన్నపరెడ్డి కీలకపాత్ర పోషించారని పలువురు కొనియాడారు. ఆయన జయంతిని కణేకల్లు లో టిడిపి, వైఎస్సార్సీపీ నాయకులతో పాటు రైతు సంఘం నాయకులు, చిన్నపరెడ్డి అభిమానులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉప్పర ఆనంద్, చంద్రశేఖర్ గుప్త, నాగిరెడ్డి, జయచంద్రారెడ్డి, రమేష్, తదితరులు పాల్గొన్నారు.