కళ్యాణదుర్గం: 20న ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహిస్తాం:జంబుగుంపలలో ఎమ్మెల్యే మేనల్లుడు ధర్మతేజ
కళ్యాణదుర్గం ప్రజా వేదికలో ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆధ్వర్యంలో ఈనెల 20న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలతో పాటు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అందరూ పాల్గొని జయప్రదం చేయాలని టీడీపీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే మేనల్లుడు ధర్మతేజ పిలుపునిచ్చారు. కంబదూరు మండలం తిమ్మాపురం, నూతిమడుగు, రాంపురం, కుందుర్పి మండలం జంబుగుంపుల, అపిలేపల్లి లలో గురువారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలకు తరలిరావాలని అదేవిధంగా అందరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. అందరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు.