రాయదుర్గం: అన్నదాత సుఖీభవ కాస్త అన్నదాత దుఖ్ఖీభనగా మారింది : కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ గౌని ప్రతాపరెడ్డి
అన్నదాత సుఖీభవ పథకం కాస్తా అన్నదాత దుఖ్ఖీభనగా మారిందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ గౌని ప్రతాపరెడ్డి ఆగ్రహం వ్యక్తం. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పిఎం కిసాన్ కాకుండా రూ. 20 వేలు ఇస్తానన్న సిఎం చంద్రబాబు మాట తప్పారని విమర్శించారు. రాయదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు బందువులు రైతుల నుంచి రాబందుల్లా పీక్కుతింటున్నారని ఆరోపించారు. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ల మంజూరు విషయంలో ఎమ్ బందువుల జోక్యం తగదన్నారు.