దర్శి: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై అధికారులకు అవగాహన కల్పించినట్లు తెలిపిన ఎమ్మార్వో రమాదేవి
Darsi, Prakasam | Jun 13, 2026 ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై అధికారులకు అవగాహన కల్పించినట్లు ఎమ్మార్వో రమాదేవి తెలిపారు. బూత్ లెవెల్ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. బి ఎల్ వో లు క్షేత్రస్థాయిలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సమగ్ర ఓటర్ లిస్టు తయారు చేయాలని ఆమె పిలుపునిచ్చారు. జులై 14 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. అవసరమైన వారు ఓటర్ లిస్టులో చేర్పులు మార్పులు చేసుకోవచ్చన్నారు.