రాయదుర్గం: రాత్రంతా మేలుకుంటే తప్ప గుక్కెడు నీళ్లు దొరకవు అంటూ పూలచర్ల గ్రామస్తుల ఆవేదన
అన్ని గ్రామాల్లో రాత్రివేళ ప్రజలు నిద్రపోతే పూలచర్ల గ్రామస్తులు మాత్రం రాత్రంతా మేల్కొంటే తప్ప గుక్కెడు నీళ్లు దొరకవు. మా గ్రామంలో మూడు బోర్లు ఉన్నాయి. వాటి విద్యుత్ మోటార్ల ఫీజులు పోయినా పట్టించుకునే వారే లేరు. శ్రీరామిరెడ్డి స్కీమ్ వాటర్ అన్ని గ్రామాలకు వస్తున్నా మా గ్రామంలో మాత్రం రావు అంటూ కణేకల్లు మండలంలోని పూలచర్ల గ్రామస్తులు వాపోయారు. తాగునీటి కోసం తాము అష్టకష్టాలు పడుతున్నామని తెలిపారు.