మార్కాపురం: జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సమయాన్ని మార్చినట్లు తెలిపిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమయాన్ని మార్పు చేస్తున్నట్లు కలెక్టర్ విజయ సునీత ఓ ప్రకటనలో తెలిపారు. వేసవి తీవ్రత దృష్టిలో పెట్టుకుని ప్రజలకు అనుకూలంగా ఉదయం 8 గంటల నుంచి అర్జీలు తీసుకుంటామని తెలిపారు. 11 గంటల వరకు అర్జీలు తీసుకోవడం జరుగుతుందని ఈ సమయం మార్పులను జిల్లాలోని ప్రజలు గమనించి తమ అర్జీలను సమర్పించాలని సూచించారు.