సంతనూతలపాడు: చీమకుర్తి మండలం బండ్లమూడి ఆంజనేయస్వామి ఆలయంలో దొంగలు చోరీకి విఫలయత్నం, హుండీని పగలగొట్టేందుకు ప్రయత్నించిన దొంగలు
ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బండ్లమూడి ఆంజనేయ స్వామి ఆలయంలో దొంగలు చోరీ చేసేందుకు విఫల యత్నం చేశారు. గురువారం అర్ధరాత్రి తర్వాత ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు హుండీని దొంగిలించి తీసుకువెళ్లారు. గ్రామ సమీపంలోని పొలాలలో హుండీ నీ పగలగొట్టేందుకు దొంగలు ప్రయత్నించారు. పగలకపోయేసరికి అక్కడే వదిలిపెట్టి దొంగలు వెళ్లిపోయారు. ఉదయాన్నే ఆలయానికి వచ్చిన అర్చకులు దొంగలు పడ్డారన్న విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.