యర్రగొండపాలెం: దోర్నాల గణపతి చెక్ పోస్ట్ సమీపంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించిన సబ్ డిఎఫ్ఓ నీరజ్ హ lన్స్
మార్కాపురం జిల్లా దోర్నాల గణపతి చెక్ పోస్ట్ సమీపంలోని అడ్వెంచర్ పార్కులో సబ్ డిఎఫ్ఓ నీరజ్ హన్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ ఫారెస్ట్ అధికారులు సిబ్బందితో యోగాసనాలు ప్రాణాయామం చేయించారు. యోగా చేయడం వల్ల ఒత్తిడిని అధిగమించి ఆరోగ్యంగా ఉండగలుగుతారని నీరజ్ హన్స్ అన్నారు. దీంతో ఉద్యోగ బాధ్యతలు చక్కగా నిర్వహించుకోవచ్చు అన్నారు. ఎఫ్ఆర్ఓ హరి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు