మార్కాపురం: విశ్వబ్రాహ్మణ కాలనీలో రోడ్డు బుడదతో తీవ్ర అవస్థలు పడుతున్నామని స్థానికులు ఆవేదన
మార్కాపురం విశ్వబ్రాహ్మణ కాలనీలో రోడ్డు బురదగా ఉండడంతో తీవ్ర అవస్థలు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో టిడ్కో ఇండ్లకు పైప్ లైన్లు వేసినప్పుడు రోడ్డును తవ్వేసి చదును చేసి వదిలేసారన్నారు. దీంతో వర్షం పడితే మొత్తం బురదగా మారి నడవలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. మంచినీళ్లు తెచ్చుకోవాలన్నా ఏ అవసరానికి వెళ్లాలన్నా రోడ్డు బురదగా ఉండడంతో ఏమి చేయలేకపోతున్నామన్నారు.