యర్రగొండపాలెం: పెద్దారవీడు మండలం ఎంపీడీవో కార్యాలయంలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లా పెద్దారవీడు ఎంపీడీవో కార్యాలయంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ విజయ సునీత పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపడుతున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా యోగాసనాల ప్రాముఖ్యతను వివరించారు. మనం ఆరోగ్యంగా ఉంటే ఏ పనైనా చేయగలుగుతామని ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు